breaking news
akarsh
-
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
'మామగారు' సీరియల్ హీరో గంగాధర్ పెళ్లి చేసుకున్నాడు. అదేనండి సీరియల్ నటుడు ఆకర్ష బైరమూడి.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ యాక్టర్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!)కర్ణాటకలోని సక్లేష్పురలో పుట్టి పెరిగిన ఆకర్ష్.. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో హీరోగా చేసి క్రేజ్ సంపాదించాడు. పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్నిపరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ తదితర సీరియల్స్ ఇతడు చేసిన వాటిలో ఉన్నాయి. అలానే 'మామగారు' సీరియల్ కూడా ఇతడి చేస్తున్నాడు.గత కొన్నిరోజుల నుంచి బ్యాచిలర్ పార్టీ, హల్దీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూ వచ్చాయి. దీంతో ఆకర్ష్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అతడి అభిమానులు అనుకున్నారు. తాజాగా ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోని యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే అమ్మాయి ఎవరనేది మాత్రం సస్సెన్స్ గానే ఉంచేశాడు. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) -
అత్తారింట్లో ఆదిత్య
‘నీవు దీనికి సరికాదు’ అన్న చోటునే ‘నువ్వే ఈ వర్క్‌కి సరైనవాడివి’ అనే కితాబు వస్తే.. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి ఆనందాన్ని నేను చవిచూశాను. ఆనందాన్ని ఇవ్వలేనిది ఎంత గొప్ప పనైనా ‘నో’ చెప్పడానికి వెనకాడను, నాకు ఏది నప్పుతుందో అదే నన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అంటూ ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చాడు ఆకర్ష్ బైరమూడి. ‘పున్నాగ’ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు అనిరుథ్గా పరిచయమై ‘జీ తెలుగు’లో వచ్చే ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్లో ఆదిత్యగా అలరిస్తున్న ఆకర్ష్ చెప్పే కబుర్లు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. మరిన్ని విశేషాలు ఆకర్ష్ నోటనే విందాం.. ‘కాలేజీ చదువు పూర్తయ్యాక ‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తున్నప్పుడు కన్నడలోని ఓ టీవీ ఛానెల్ సీరియల్లో హీరోపాత్ర రీప్లేస్‌కు అవకాశం వచ్చింది. అప్పటికి అనుమానంగానే ఒప్పుకున్నాను ఆల్రెడీ ఒక పాత్రలో చూసిన జనం నన్ను యాక్సెప్ట్ చేస్తారా..’ అని. పైగా నటనకు కొత్త. కుటుంబ నేపథ్యం కూడా లేదు. సందేహంగానే మూడు నెలలు ఆ సీరియల్లో యాక్ట్ చేశాను. కానీ, అనుకున్నంత గుర్తింపు రాలేదు. పైగా విమర్శలు వచ్చాయి. ‘నువ్వు యాక్టింగ్‌కి సెట్ అవవు’ అన్నారు చానల్‌వాళ్లు. దాంతో బయటకు వచ్చేశాను. ‘ఈ యాక్టింగ్ మనకు సూట్‌కాదు ఏదో జాబ్ చూసుకుందాం’ అనుకున్నాను. బీటెక్ తర్వాత ఎంబీయేలో చేరాను. ఆ టైమ్‌లోనే హైదరాబాద్ ‘జీ తెలుగు’ నుంచి ఫోన్.. ‘ఆడిషన్స్‌కి రమ్మని.’ అప్పటికే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. ‘యాక్టింగ్ మానేశాను, రాలేను’ అని చెప్పాను. కానీ, వాళ్లు ఈ సీరియల్‌కి మీరే కరెక్ట్ అనడంతో ఆడిషన్స్‌కి వచ్చాను. వాళ్లిచ్చిన డైలాగ్ ఇంగ్లిష్‌లో రాసుకొని బట్టీ పట్టి అప్పజెప్పాను. కానీ, నాకైతే నమ్మకం లేదు. ‘బెంగుళూరు వాళ్లే రిజెక్ట్ చేశారు. ఇక్కడ తెలుగు భాష కూడా రాదు. ఇక తెలుగులో అవకాశాలేం వస్తాయి..?’ అనుకున్నాను. కానీ మరుసటి రోజే ‘మీరు సెలక్ట్’ అని ఫోన్ కాల్. దీంతో హైదరాబాద్‌లోనే సెటిల్. మూడు నెలల్లో తెలుగు నేర్చుకున్నాను. ఏడాదిన్నరపాటు పున్నాగ సీరియల్లో నటించాను. ఈ సీరియల్ నాకు మంచి పేరును, గుర్తింపును తెచ్చిపెట్టింది. అక్కణ్ణుంచి మంచి మంచి ప్రాజెక్టులు రావడం ప్రారంభించాయి. వద్దన్నవారే పిలిచారు పున్నాగ సీరియల్ తర్వాత కన్నడలో ఏ ఛానెల్ అయితే నన్ను రిజెక్ట్ చేసిందో అదే ఛానెల్ వాళ్లు ఫోన్ చేసి ‘మా సీరియల్లో మీరే చేయాల’ని పట్టుబట్టారు. ముందు వద్దన్నవాళ్లే తర్వాత పిలిచి మరీ ఆఫర్ ఇస్తానంటే ఎందుకు వదులుకోవడం అని వెళ్లాను గానీ అక్కడ వర్క్ నచ్చలేదు. అప్పటికే తెలుగులో మరో సీరియల్‌కి అవకాశం వచ్చింది. తెలుగు నాకు గుర్తింపును, లైఫ్‌ని, సంతోషాన్ని ఇచ్చింది. అందుకే కన్నడ సీరియల్‌కి బై చెప్పి తెలుగు ప్రాజెక్ట్ ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్‌కి వచ్చేశాను. ఆ టైమ్‌లో కన్నడ సీరియల్ వాళ్లు మాపై రివెంజ్ తీర్చుకోవడానికే ఇలా చే శాడు అని విమర్శించారు. నాన్న చాలా హ్యాపీ నాన్న మాకున్న కాఫీ ఎస్టేట్ వర్క్ చూస్తుంటారు. అమ్మ గృహిణి. అన్నయ్య ఇంటీరియర్ డిజైనర్. చేసే వర్క్ పట్ల సంతృప్తి, సంతోషం ఉంటేనే చేయమంటారు వాళ్లు. నేను టీవీ నటుడిని అవడంతో ఆయన చాలా హ్యాపీ. భాష రాకపోయినా నా సీరియల్‌ని తప్పక చూస్తారు. నా స్వెటర్‌ని భద్రంగా దాచుకుంది ఎల్కేజీ రోజుల్లో చదువు కోసం నన్ను ఊటి హాస్టల్లో ఉంచారు అమ్మానాన్నా. ఓ రోజు మా కజిన్ నన్ను ఔటింగ్కని ‘బ్లాక్ థండర్’ ప్లేస్‌కి తీసుకెళ్లారు. అక్కడ నేను తప్పిపోయాను. సెక్యూరిటీ వాళ్లు పేరెంట్స్ పేర్లు అడిగితే చెప్పలేకపోయాను. ఎవరో ఒకావిడ రావడం, వాళ్లతో మాట్లాడడం నన్ను తీసుకెళ్లడం జరిగిపోయింది. నన్ను తీసుకెళుతున్న ఆవిడ గేటు దాటుతుండగా నా స్వెటర్ చూసి గుర్తుపట్టిన మా కజిన్ గట్టిగా పేరు పెట్టి పిలుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆమె నన్ను అక్కడ దించేసి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు నేను ఆమెతో ఆ గేటు దాటి ఉంటే మా పేరెంట్స్‌కు ఎప్పటికీ దొరికుండేవాడిని కానని ఇప్పటికీ అనుకుంటాను. ఆ స్వెటర్‌ని మా అమ్మ భద్రంగా దాచుకుంది. నచ్చినది చేసుకుంటూ వెళ్లడమే! డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏంటి అంటే.. ఏమీ చెప్పలేను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా ఉండడమే. నాకు ఏది సూటవుతుందో అదే వస్తుంది అని నా గట్టి నమ్మకం. నిర్మలారెడ్డి -
‘ఫేటు’ మారిందా ... సీటు గోవిందా
ఈ మధ్య కాంగ్రెస్ నాయకుడొకరు మాటిమాటికి తెలంగాణ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్నారు. ప్రచారమే పరమావధిగా పెట్టుకున్న ఆయన సొంత పార్టీ నాయకులను సైతం వెనక్కి నెట్టి దూకుడు మీదున్నారు. సదరు నేత స్పీడ్‌కు బ్రేక్ వేయాలని గులాబీ దళపతి పన్నిన వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ‘‘మళ్ల మండలిలో నేను కాలుబెట్టే వరకు ఆ నాయకుడు.. ఆ సీట్లో ఉండొద్దు. ఏందయ్యా ప్రతీ దాంట్లో వేలు పెడుతుండు. ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు. మీరేం చేస్తరో నాకు తెల్వదు..’’ అంటూ గులాబీ నేత హుకుం జారీ చేశారట! ఈ ముచ్చట తెలిసి ఆ నాయకుడు యమ హైరానా పడుతున్నాడట. గులాబీ పార్టీ నాయకులు ఏం ప్లాన్ చేస్తున్నారంటూ సదరు కాంగ్రెస్ నేత పీఏలు, పీఆర్వోలు తమకు తెలిసిన విలేకరులందరినీ వాకబు చేయడం మొదలు పెట్టారు. ఇంతకూ ఏం సీటు.. మారబోతోందని ఆరా తీసినోళ్లకు గులాబీ నేతలు దిమ్మ తిరిగే సమాధానం చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో మండలిలో కాంగ్రెస్ శిబిరంలో సగానికి పైగా ఖాళీ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఓ సభ్యుడు గులాబీ గూటిలో సర్దుకున్నారు. మరో ముగ్గురు గట్టు దాటితే చాలు ప్రతిపక్ష హోదా ఢమాల్. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి తలలూపారట. ఇంకే ముంది.. ఇంకొక్కరు గోడ దూకితే చాలు. వీరి భుజాల మీద గులాబీ కండువాలు కప్పించేందుకు కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి అధికార పార్టీ పంచన చేరిన ఓ సీనియర్ నేత చక్రం తిప్పుతున్నారని గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ ఇదే జరిగిందా... నూటా ముప్పై వసంతాల వయసు దాటిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది. దీంతో ప్రతిపక్ష నేత పదవీ కనుమరుగువుతుంది. జోరుగా సాగుతున్న ‘ఆపరేషన్ ఆకర్ష్’ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోందట!