Taraka Ratna : తారకరత్నకు ఎన్టీఆర్‌ అంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు ఆయన పేరే!

Taraka Ratna Children Names Combination Of Ntr Pics Viral - Sakshi

తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను అటు కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న  23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

అజాత శత్రువుగా, ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా తారకరత్నది ప్రేమ వివాహం.ఆయన నటించిన నందీశ్వరుడికి  కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన అలేఖ్యతో ఆయన ప్రేమలో పడ్డారు.అయితే అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకోవడంతో వీరి పెళ్లికి కుటుంసభ్యులు ఒప్పుకోలేదు.

అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె పుట్టగా నిషిక అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి. వీరికి తాన్యారామ్‌, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు  NTR (Nishka, Tanayram, Reya)ఎన్టీఆర్ అని వచ్చే విధంగా పిల్లలకు పేర్లు పెట్టారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top