
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. అంతకుముందు ఒకట్రెండు స్పెషల్ సాంగ్స్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైన తమన్నా ఆసక్తికర వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ 'డూ యు వన్నా పార్టనర్'. ఈ సిరీస్‌కు అర్చిత్ కుమార్, కాలిన్ డికున్హా దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగా కానుందని వెల్లడించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ సొంత ఆల్కహాల్ వెంచర్‌ను స్థాపించాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్లో జావేద్ జాఫ్రే, నకుల్ మెహతా, సూఫీ మోతీవాలా, నీరజ్ కబీ, శ్వేతా తివారీ, రణ్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటించారు.
raising a toast because they’re here with something brew-tiful 🍺#DoYouWannaPartnerOnPrime, New Series, September 12 pic.twitter.com/NM9tLCKPRG
— prime video IN (@PrimeVideoIN) August 25, 2025