#కింగ్‌ 100లో ఎంట్రీ | Tabu commences the shoot for Nagarjuna 100th Film King100 | Sakshi
Sakshi News home page

#కింగ్‌ 100లో ఎంట్రీ

Apr 28 2026 12:23 AM | Updated on Apr 28 2026 12:23 AM

Tabu commences the shoot for Nagarjuna 100th Film King100

నాగార్జున హీరోగా నటిస్తున్న ‘#కింగ్‌ 100’ సినిమాలో భాగమయ్యారు నటి టబు. ఆర్‌ఏ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. కాగా, ఈ సినిమాలో నటి టబు భాగం అయినట్లుగా మేకర్స్‌ సోమవారం ప్రకటించారు. ‘‘సెట్స్‌లో మీ రాక మాకెంతో గౌరవంగా ఉంది.

ఈ సినిమాలో మీరు భాగం కావడంతో మా మైల్‌స్టోన్‌ సినిమా మరింత స్పెషల్‌గా మారిపోయింది’’ అంటూ ‘#కింగ్‌ 100’ సినిమా యూనిట్‌ పేర్కొంది. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తాను జాయిన్‌ అయినట్లు ఇన్‌స్టా వేదికగా టబు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా టబు కనిపిస్తారా? లేదా కీలక పాత్ర చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

నాగార్జున కెరీర్‌లోని ఈ వందో సినిమాలో సుస్మితా భట్, విజయేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని, తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నిన్నే పెళ్లాడతా’(1996), ‘ఆవిడా మా ఆవిడే’     (1998) చిత్రాల్లో నాగార్జున, టబు జోడీగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement