వాట్సాప్ చాట్‌ను బ‌హిర్గ‌తం చేసిన సుశాంత్ సోద‌రి

Sushants Sister Shweta Shares  WhatsApp Chat Exchange Wanting doobie - Sakshi

బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్న రియా చ‌క్ర‌వ‌ర్తిపై ఉచ్చు బిగుస్తోంంది. అయితే త‌న‌కే పాపం తెలియ‌ద‌ని, సుశాంత్ మ‌ర‌ణంలో త‌న ప్ర‌మేయం లేద‌ని రియా చక్ర‌వ‌ర్తి  ప్ర‌ముఖ ఛాన‌ల్ ఆజ్‌త‌క్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సుశాంత్ కుటుంబంపై ఆమె ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో రియా వాద‌న‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని పేర్కొంటూ సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్  రియాకు సంబంధించి  ప‌లు వాట్సాప్ చాట్‌ల‌ను బ‌హిర్గ‌తం చేశారు. ఇందులో ప్ర‌ధానంలో రియా, షోయుక్ చ‌క్ర‌వ‌ర్తి, సిద్ధార్థ్ పిథాని, శ్యాముల్ మిరిండాల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌, అందులో సుశాంత్‌కు డ్ర‌గ్ ఇవ్వ‌డం లాంటి విష‌యాల‌ను శ్వేతా బ‌య‌టపెట్టారు. డూబీ (గంజాయి ) ఇవ్వండి అని షోయుక్ అడ‌గ‌గా, ఇప్పుడే సుశాంత్ తీసుకున్నాడు అని పిథాని బ‌దులిచ్చాడు.  జూలై 30, 2019న‌ మ‌రొక చాట్‌లో డూబీ కావాలి అని రియా అడ‌గ‌గా అట్నుంచి రోలింగ్, గెట్టింగ్ అనే స‌మాధానం వ‌చ్చింది.  ఎన్ఐఎఫ్‌డ‌బ్ల్యూ పేరుతో ఉన్న ఈ వాట్సాప్ గ్రూపులో రియా, ఆమె సోద‌రుడు షోయుక్, సిద్ధార్థ్ పిథాని స‌హా మ‌రికొంద‌రు ఉన్నారు. (‘బ్రేకప్‌ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’)

డూబీ (గంజాయి) కావాల‌ని, సుశాంత్ అది తీసుకున్నాడా లేదా లాంటి విష‌యాలే ఎక్కువ‌గా చ‌ర్చించారు. దీనికి సంబంధించిన‌  వాట్సాప్ స్క్రీన్ షాట్ల‌ను సుశాంత్ సోద‌రి శ్వేతా సోష‌ల్ మీడియాలో బ‌హిర్గ‌తం చేసింది. దోషుల‌ను అరెస్ట్ చేయండంటూ ఓ క్యాప్ష‌న్‌ను జ‌త‌చేశారు. అంతేకాకుండా త‌న కుటుంబంపై రియా చేస్తున్న ఆరోప‌ణల్లో ఏ మాత్రం నిజం లేద‌ని పేర్కొన్నారు. త‌న సోద‌రుడు సుశాంత్‌ను ప్రేమ పేరుతో రియా వాడుకుంద‌ని ఆరోపించారు. ప్ర‌తీ నెల 17 వేల రూపాయ‌లు ఈఎంలు క‌ట్టుకునే సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలోని రియాకు దేశంలోనే అత్యంత ఖ‌రీదైన లాయ‌ర్‌ను ఎలా పెట్టుకోగ‌లిగిందంటూ ప్ర‌శ్నించారు.  కాగా జూన్‌ 14న బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. సుశాంత్‌ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. సుశాంత్‌తో పరిచయం నాటి నుంచి సహజీవనం, జూన్‌ 8న ఫ్లాట్‌ ఖాళీ చేసి వెళ్లడం తదితర విషయాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. (రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top