బ్రేకప్‌ నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్‌ | Sunainaa: Let Me Recover From Last Heart Break | Sakshi
Sakshi News home page

Sunainaa: పెళ్లా? బ్రేకప్‌ నుంచే ఇంకా కోలుకోలేదు.. రాజరాజ చోర హీరోయిన్‌

Nov 17 2022 9:03 PM | Updated on Nov 17 2022 9:41 PM

Sunainaa: Let Me Recover From Last Heart Break - Sakshi

పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది.

దీనికామె బ్రేకప్‌ నుంచి ఇంకా కోలుకోలేదని బదులిచ్చింది. మరొకరు కష్టసమయాల్లో ఏం చేస్తారని అడగ్గా.. ఈ మధ్యే చదవడం ప్రారంభించా, పుస్తక పఠనం వల్ల ఎంతో

కుమార్‌ వర్సెస్‌ కుమారి అనే తెలుగు చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది హీరోయిన్‌ సునైనా. కడలిల్‌ విసంతిన్‌(2008) సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. మాసిలమణి, వంశం సినిమాలతో అలరించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన సునయన గతేడాది రిలీజైన రాజ రాజ చోరతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది.

దీనికామె బ్రేకప్‌ నుంచి ఇంకా కోలుకోలేదని బదులిచ్చింది. మరొకరు కష్టసమయాల్లో ఏం చేస్తారని అడగ్గా.. ఈ మధ్యే చదవడం ప్రారంభించా, పుస్తక పఠనం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది అని చెప్పింది. తెలుగులో సినిమాలు చేయండి ప్లీజ్‌ అని ఓ అభిమాని కోరగా.. తప్పకుండా చేస్తానంటూ 'మీట్‌ క్యూట్‌', 'లాఠీ', 'రెజీనా' సినిమా పేర్లను రాసుకొచ్చింది. కాగా సునయ నటించిన వండర్‌ ఉమెన్‌ సోనీలివ్‌లో రేపటి నుంచి ప్రసారం కానుంది.

చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేస్తోన్న కాంతార, కాకపోతే ఓ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement