
టాలీవుడ్ హీరో సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగిన పాటలో సుహాస్, మాళవికా చాలా క్యూట్‌గా కనిపించారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటను టిప్పు, హరిణి ఆలపించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఇందులో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు.