'దయచేసి అర్థం చేసుకోండి'.. సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతం | Singer Mangli Cries at Punjahutta Police Station After Complaint | Sakshi
Sakshi News home page

Singer Mangli: 'శాపంగా మారుతుందని అనుకోలేదు'.. సింగర్ మంగ్లీ కంటతడి

Apr 12 2026 6:42 PM | Updated on Apr 12 2026 9:16 PM

Singer Mangli Cries at Punjahutta Police Station After Complaint

టాలీవుడ్ సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తనపై వస్తున్న ‍అసత్య ప్రచారంపై తన బాధను వ్యక్తం చేసింది. ఎవరో వచ్చి నాపై ఆరోపణలు చేస్తే.. ఏది పడితే రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. కేవలం పాటే నా ప్రాణమని మంగ్లీ ఆవేదన తెలిపింది. నిజనిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరింది. నేను కూడా సోషల్ మీడియా నుంచే వచ్చానని.. కానీ అదే నాకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నాడని మంగ్లీ అన్నారు. నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకు లాగకండని కోరింది. మీడియా అంటే తనకు చాలా గౌరవం ఉందని.. దయచేసి ఈ విషయంలో మీరు వెనక, ముందు చూసుకోవాలని సూచించింది. ఎవరెవరో నేనంటే పడని వాళ్లు.. నాపై ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. నాపై పార్టీ ముద్రలు వేయడంతో 2003 తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు కూడా పాడలేదన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement