Sindhooram Reviw: ‘సిందూరం’ మూవీ రివ్యూ

Sindhooram Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: సిందూరం
నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ తదిరులు
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా
దర్శకుడు: శ్యామ్ తుమ్మలపల్లి
సంగీతం: గౌవ్రా హరి
సినిమాటోగ్రఫీ: కేశవ్
ఎడిటర్: జస్విన్ ప్రభు
విడుదల తేది: జనవరి 26, 2023

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 2023 ప్రాంతంలో సాగుతుంది. ఖమ్మం జిల్లా పినపాక‌కు చెందిన రవి (ధర్మ), శిరీష (బ్రిడిగా సాగా) కాలేజీలో మంచి స్నేహితులు. చదువు పూర్తయ్యాక శిరీష ఎమ్మార్వో ఉద్యోగం సాధించి సొంత ఊరికి వెళ్తుంది. ధర్మ బాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంటాడు. అయితే  కారణం చేత ధర్మ బాడ్మింటన్‌కి దూరమై నక్సలైట్‌ సానుభూతిపరుడిగా మారతాడు. శిరీష ఎమ్మార్వో ఉద్యోగం వదిలేసి సొంత ఊరు శ్రీరామగిరి జెడ్పీటీసీగా పోటీ చేస్తుంది. దీంతో శిరీషను అదే ప్రాంతంలోని సింగన్న (శివబాలాజీ) దళం టార్గెట్ చేస్తుంది. అసలు శిరీష ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? ఆమెను సింగన్న దళం ఎందుకు టార్గెట్‌ చేసింది?  బాడ్మింటన్ కావాలనుకున్న ధర్మ ఎందుకు నక్సల్స్‌తో చేతులు కలిపాడు?  శిరీష అన్న, రాజకీయ నేత ఈశ్వరయ్య(రవి వర్మ)ను చంపింది ఎవరు? పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగిన పోరులో ఎవరు బలైయ్యారు? చివరకు రవి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాకు ప్రధాన బలం బ్రిగిడ సాగా పోషించిన పాత్ర. శిరీషగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌ ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. అలాగే రవి పాత్రలో ధర్మ ఒదిగిపోయాడు. తొలి చిత్రమే అయినా చక్కగా నటించాడు.  చాలా బరువైన పాత్ర తనది. క్లైమాక్స్‌లో ఆయన చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. శివ బాలాజీ ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. ఈశ్వరయ్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చిరంజీవి అభిమానిగా జోష్‌ రవి నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా సినిమాలోని పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించాయి.

ఎలా ఉందంటే...
నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. సిందూరం కూడా ఆ తరహా చిత్రమే. 90 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు సంఘటనలు, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్యామ్‌ తుమ్మలపల్లి. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. నక్సల్స్, పోలీసుల మధ్య నలిగిపోయిన ప్రజల జీవితాలు, రైతుల వ్యధలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. కానీ ఈ సినిమాలో ఎమోషనల్‌ టచ్‌ మిస్‌ అయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు ఎర్రజెండా ప్రేమికులకు ఇబ్బందిగా ఉంటాయి. పస్టాఫ్‌ కాస్త స్లోగా సాగుతుంది. కానీ సెకండాఫ్‌ మెప్పిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top