నా కూతురి పెళ్లి గురించి తెలియదు: సోనాక్షి తండ్రి కామెంట్స్ వైరల్! | Shatrughan Sinha Breaks Silence On His Daughter Sonakshi Sinha Wedding Plans With Zaheer Iqbal | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: 'మాకు సోనాక్షి పెళ్లి విషయం తెలియదు'.. నటి తండ్రి ఆసక్తికర కామెంట్స్!

Published Tue, Jun 11 2024 1:11 PM

Shatrughan Sinha Says I dont Know about Sonakshi Sinha Wedding Plans

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబయిలో జరిగనున్న వీరి వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. సోనాక్షి పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కూతురు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొన్నారు. సోనాక్షి, జహీర్‌ల వివాహం గురించి తనకు తెలియదని.. అయితే వారి బంధానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పెళ్లి విషయం నాకు తెలిసినప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తానని శత్రుఘ్న సిన్హా అన్నారు.

శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.."నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. నా కుమార్తె పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. తన పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీడియాలో చదివి మాత్రమే తెలుసుకున్నా. ఒకవేళ తాను మాకు చెబితే నేను, నా భార్య  ఆశీస్సులు అందిస్తాం. మేము కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. తనకు స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు.' అని చెప్పారు.

కాగా.. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తమ రిలేషన్ ‍గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పుటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కాగా.. సోనాక్షి ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్‌ బజార్‌ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  సోనాక్షి, జహీర్ 2022లో వచ్చిన డబుల్ ఎక్స్‌ఎల్‌ చిత్రంలో కలిసి నటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement