షారుక్ ఖాన్‌ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ | Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry | Sakshi
Sakshi News home page

Sharuk Khan: షారుక్ ఖాన్‌ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

Published Sat, Jun 25 2022 1:58 PM | Last Updated on Sat, Jun 25 2022 2:02 PM

Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry - Sakshi

Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనేక విజయాలు, గ్లామర్‌ పాత్రలు, రొమాంటిక్‌ హీరోగా పేరు గడించిన షారుక్‌ ఖాన్‌ 'కింగ్‌ ఖాన్‌'గా మన్ననలు పొందాడు. ఈ బాలీవుడ్‌ బాద్‌షా సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్‌ 25) 30 ఏళ్లు పూర్తయింది. 1992 జూన్‌ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన స్టార్‌డమ్‌ పెంచుకున్నాడు. ఇక షారుక్‌, కాజల్‌ రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ 'దిల్‌ వాలే దుల్హానియా లే జాయేంగే'తో ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది.

ఇదిలా ఉంటే షారుక్ ఖాన్‌ తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. షారుక్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పఠాన్‌' నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో చేతిలో గన్‌తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్న షారుక్‌ను చూడొచ్చు. ఈ పోస్టర్‌ రిలీజైన అతి తక్కువ సమయంలోనే నెట్టింట షేక్ చేస్తోంది. కాగా పఠాన్‌ మూవీలో దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

(చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్‌ ఏంటంటే ?)

'పఠాన్‌'తోపాటు షారుక్‌ ఖాన్‌ అట్లీ దర్శకత్వంలో 'జవాన్‌' సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. రాజ్‌ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవేకాకుండా మాధవన్‌ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్‌', అమీర్‌ ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్ధా', రణ్‌బీర్‌ కపూర్‌ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్‌ 'టైగర్‌-3' చిత్రాల్లో కింగ్‌ ఖాన్‌ కెమియో ఇవ్వనున్నట్లు సమాచారం. 

(చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం
నడిరోడ్డుపై యంగ్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement