పెళ్లి చేసుకోనున్న నిఖిల్‌-కావ్య? నటుడి ఆన్సరిదే! | Serial Actor Nikhil Gives Clarity On Wedding Rumors With Co Actor Kavya Sree, Deets Inside - Sakshi
Sakshi News home page

Nikhil-Kavya Sree Marriage Rumours: త్వరలో బుల్లితెర జంట పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Published Fri, Jan 19 2024 3:50 PM

Serial Actor Nikhil Gives Clarity on Wedding Rumors with Kavya Sree - Sakshi

ఆన్‌స్క్రీన్‌లో జంటగా కనిపించే సెలబ్రిటీలు రియల్‌ లైఫ్‌లో కూడా జోడీగా ఉంటే చూడాలని ముచ్చటపడుతుంటారు అభిమానులు. అలాగే చాలామంది రీల్‌ జంటగా మిగిలిపోకుండా రియల్‌ లైఫ్‌లోనూ పెళ్లి చేసుకుని చూపించారు. ఈ క్రమంలో బుల్లితెర జంట కావ్య-నిఖిల్‌కు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఏ షోకి వెళ్లినా జంటగా వెళ్లే వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నిస్తున్నారు. నిజమైన దంపతులుగా చూడాలని ఉందని అభిమానులు తహతహలాడుతున్నారు.

తను నాకు ఫ్రెండ్‌గా దొరకడమే గ్రేట్‌
ఈ క్రమంలో పెళ్లిపై పెదవి విప్పాడు నటుడు నిఖిల్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'కావ్య చాలా మంచి అమ్మాయి, మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తే బాగుండని నాలాంటి ప్రతీ అబ్బాయి కోరుకుంటాడు. నిజం చెప్పాలంటే తను నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా దొరకడమే గొప్ప. మీరంతా లవ్వు, గివ్వు అని ఎక్కడికో వెళ్లిపోతున్నారు. జనాలకు మేము జంటగా కనిపిస్తే ఇష్టం. అందుకే మేమిద్దరం కలిసే షోలు చేస్తాము. మేము పెళ్లి చేసుకుంటామా? లేదా? అన్నది మా చేతుల్లో లేదు.

పెళ్లి గురించి ఆలోచించట్లే
అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మా ఇంట్లో పెళ్లి గురించి తొందరపడటం లేదు. కాబట్టి ఇప్పట్లో దాని జోలికి వెళ్లను' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. త్వరలోనే మీరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ నుంచి బెస్ట్‌ రియల్‌ కపుల్‌గా ప్రమోషన్‌ పొందాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరిద్దరూ ప్రస్తుతం ఓ సీరియల్‌, వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు.

చదవండి: విఘ్నేశ్‌ ఎల్‌ఐసీ.. సినిమా నుంచి తప్పుకున్న నయనతార?

whatsapp channel

Advertisement
 
Advertisement