టాలీవుడ్‌లో తీవ్ర విషాదం | RRR Cinematographer Senthil Kumar Wife Roohi Passed Away - Sakshi
Sakshi News home page

Senthil Kumar: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి

Published Thu, Feb 15 2024 8:00 PM

RRR Cinematographer Senthil Kumar Wife Roohi Passed Away - Sakshi

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రుహీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృత్తిరీత్యా ఆమె యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

కాగా.. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పని చేశారు. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు. కాగా..సెంథిల్‌ కుమార్  జూన్ 2009లో రూహీని వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో సెంథిల్ కుమార్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. టాలీవుడ్‌లో  సై, ఛత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement