
కొందరు కథానాయికలు సినిమాల్లో బాక్సింగ్లో దుమ్ము రేపి ఉండవచ్చు. అయితే నిజ జీవితంలోనే బాక్సింగ్లో అదరగొట్టిన నటి రితికాసింగ్. అవునుఉ రియల్ బాక్సర్‌గా బరిలో రఫ్పాడించి విన్నర్గానిలిచిన ఈ బ్యాఊటీ ఇరుదుచుట్ర చిత్రంతో రీల్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ రీమేక్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులకు రితికా సింగ్ను పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ ఉత్తారణి జాణ వరుసగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల వేట్టయాన్ చిత్రంలో రజనీకాంత్తో కలిసి పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో ఒక్కో నటుడు ఒక్కో విధంగా మానవత్వంతో ప్రశాశిస్తున్నవారేనన్నారు. అలాంటి వారితో నటించిన తరుణాలు తన మనసులో ఎప్పటికీ పదిలమేనన్నారు. అలాంటి వారిలో ఒక్కరిని ఎంపిక చేయాలంటే అది రజనీకాంత్ నే అన్నారు. ఆయన ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా..ఇతరులపై చూపించే ప్రేమాభిమానాలు ఎపప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు.
మహిళలపై అత్యాచారాలంటేనే తనలో కోపం కట్టలు తెంచుకుంటుదన్నారు. మిమ్మల్ని ఎవరైనా సైట్ కొడితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు కొంచెం పక్కకు రమ్మంటానని, ధైర్యం ఉంటే అలాంటోడిని రమ్మనండి చూద్దాం అని సవాల్ చేశారు. వైవిధ్యమైన కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు రితికాసింగ్ తెలిపారు.