గతేడాది కాంతార-2 మూవీతో సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కొత్త ఏడాదిలో సడన్ షాకిచ్చాడు. ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ఏ ఫిల్మ్ బై గిరి. ఈ మూవీలో ఇందిర హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఏ ఫిల్మ్ బై గిరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రిషబ్ శెట్టి మూవీ స్క్రిప్ట్ రైటర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుధ్ మహేశ్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజీ మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్.పి తాపేశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.


