Raviteja: కుమారుడి ఎంట్రీపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Raviteja interesting Comments On his Son Mahadhan Tollywood Entry - Sakshi

మాస్ మహారాజా రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగారు. ఈ ఏడాదిలో వచ్చిన ధమాకా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.  ఈ సినిమా ఏప్రిల్ 7 న థియేటర్లలో సందడి చేయనుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో  మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు రవితేజ. ఇందులో భాగంగా రవి తేజ, సుశాంత్‌తో కలిసి డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా రవితేజ తన కుమారుడి  మహాధన్ టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహాధన్ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పుడు రవితేజగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. 

రవితేజ మాట్లాడుతూ..' ఆ విషయం నాకు తెలియదు.. అస్సలు ఇప్పటివరకు అలాంటి ఐడియా కూడా రాలేదు. ఈ విషయంలో నాకేలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది.. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తానంటే వెళ్లు అని చెప్తా. ఒక్క సలహా కూడా ఇవ్వను. వాడికి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేశాను. కెరీర్ పట్ల ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. వాడి గురించి నేను చెప్పడం కాదు. తెలుసుకోవాలి.' అని అన్నారు.  దీంతో మహాధన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top