breaking news
Mahadhan
-
తెలుగు స్టార్ హీరోల పిల్లలు.. భవిష్యత్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుత జనరేషన్ తెలుగు హీరోల్లో చాలామంది ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి బాధ్యతల్ని అంతే చక్కగా పూర్తి చేస్తున్నారు. తమ కొడుకు లేదా కూతురికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. దీంతో హీరోల కొడుకులు హీరోలే కావాలని కాకుండా పలు రంగాల్లో తమ ప్రతిభ చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ యంగ్ హీరోల వారసులు ఏం చేస్తున్నారు? వాళ్ల భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) సందర్భంగా మీకోసం.మహేశ్ బాబు విషయానికొస్తే కొడుకు గౌతమ్, కూతురు సితార.. ఇదివరకే తన సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించారు. గౌతమ్‌కి స్పోర్ట్స్ స్టార్‌గా ఎదగాలని కల ఉందట. మరి అందుకు తగ్గ ప్రిపరేషన్స్‌లో ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికైతే విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార అయితే టీనేజీలోకి రాకముందు నుంచి నటి కావాలని తెగ ఇంట్రెస్ట్ చూపించింది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పటికే నేర్చుకుంది. జ్యూవెల్లరీ షాప్ యాడ్ కూడా చేసేసింది. చూస్తుంటే అటు గౌతమ్, ఇటు సితార ఇద్దరూ కూడా నటులే అయ్యేలా కనిపిస్తున్నారు.అల్లు అర్జున్ విషయానికొస్తే.. కొడుకు అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తండ్రిలా నటుడు అవుతాడా లేదా అనేది స్తుతానికి సస్పెన్స్. కూతురు అర్హ మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుంది. గతంలోనే సమంత 'శాకుంతలం'లో బాలనటిగా చేసింది. చూస్తుంటే పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్.. తండ్రిలా హీరో కావాలని అనుకోవట్లేదట. దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ కొడుకు మహాధన్.. గతంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో తండ్రి చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాడు. కానీ ఇతడి మనసులో మాత్రం దర్శకత్వం ఆలోచనే ఉందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద అయితే అటు నటన ఇటు దర్శకత్వం లాంటివి కాకుండా నిర్మాత అయ్యే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ అదే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.నాని కొడుకు అర్జున్.. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పియానో ప్లే చేస్తున్న వీడియోని నాని భార్య అంజన.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. మరి సంగీతం వైపు వస్తాడా లేదంటే తండ్రిలా యాక్టర్ అవుతానని అంటాడా అనేది తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాలి. మంచు విష్ణు వారసులు ఇప్పటికే స్క్రీన్ పై కనిపించేశారు. కుమార్తెలు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్.. 'కన్నప్ప' మూవీలో యాక్ట్ చేశారు. చూస్తుంటే విష్ణు తర్వాత తరాన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడనమాట.తెలుగు దర్శకుల్లో సుకుమార్ కూతురు సుకృతి.. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' మూవీలో నటించింది. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. కానీ ఈమెకు మాత్రం మ్యూజిక్ టీచర్ కావాలని ఉందట. డైరెక్టర్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మనోజ్.. ఇప్పటికే దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట.వీళ్లందరినీ చూస్తుంటే రాబోయే తరంలోనూ నటీనటులతో పాటు మ్యూజిక్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరెవరు ఏమేమవుతారనేది రాబోయే కొన్నేళ్లలో కాలమే నిర్ణయిస్తుంది. -
తనయుడి టాలీవుడ్ ఎంట్రీ.. రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మాస్ మహారాజా రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగారు. ఈ ఏడాదిలో వచ్చిన ధమాకా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 7 న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు రవితేజ. ఇందులో భాగంగా రవి తేజ, సుశాంత్‌తో కలిసి డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా రవితేజ తన కుమారుడి మహాధన్ టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహాధన్ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పుడు రవితేజగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రవితేజ మాట్లాడుతూ..' ఆ విషయం నాకు తెలియదు.. అస్సలు ఇప్పటివరకు అలాంటి ఐడియా కూడా రాలేదు. ఈ విషయంలో నాకేలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది.. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తానంటే వెళ్లు అని చెప్తా. ఒక్క సలహా కూడా ఇవ్వను. వాడికి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేశాను. కెరీర్ పట్ల ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. వాడి గురించి నేను చెప్పడం కాదు. తెలుసుకోవాలి.' అని అన్నారు. దీంతో మహాధన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? మాస్ మహారాజ ఆన్సర్ ఇదే
మాస్ మహారాజ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న రవితేజకు తనయుడు మహాధన్ భూపతి సినీ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. గత కొన్నిరోజులుగా మహాధన్ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'ఇడియట్ 2' సీక్వెల్‌తో కొడుకును పరిచయం చేయనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై రవితేజను ప్రశ్నించగా.. ఇలాంటి వార్తలు వినడం ఇదే మొదటిసారి అని, ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని తేల్చిచెప్పాడు. -
వైరల్ ఫొటో: మాస్ మహారాజా కొడుకును చూశారా?
వరుస ఫ్లాపులతో సతమతమయిన రవితేజకు ఈ ఏడాది విడుదలైన 'క్రాక్' కొండంత ఎనర్జీనిచ్చింది. కరోనా సమయంలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేయడమే కాక అభిమానులతో ఈలలు వేయించింది. అలా బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఈ ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించాడు రవితేజ. క్రాక్ ఇచ్చిన బూస్టింగ్‌తో స్పీడ్ పెంచాడీ హీరో. ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి' షూటింగ్లో పాల్గొంటున్నాడు. తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అలాగే శరత్ మండవ డైరెక్షన్లో మాస్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. దర్శకులు హరీశ్ శంకర్, వంశీకృష్ణల ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా వుంటే ఆదివారం ఫాదర్స్‌డే సందర్భంగా రవితేజ తన తండ్రి, కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో రవితేజ కొడుకు మహాధాన్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ఇది చూసిన ఆయన అభిమానులు రానున్న రోజుల్లో రవితేజ తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. కాగా రవితేజ 2000వ సంవత్సరంలో కల్యాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు మోక్షధ, కొడుకు మహాధాన్ సంతానం. చదవండి: మాస్ టైటిల్.. మైండ్ బ్లోయింగ్ లుక్ -
ఓవైపు ఫ్యామిలీ.. మరోవైపు జిమ్..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో నటీనటులంతా ఇళ్లకే పరిమితయ్యారు. లాక్డౌన్ వేళ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ప్రముఖ హీరో రవితేజ్ కూడా ఈ సమయాన్ని పిల్లలతో, కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జిమ్‌లో కూడా వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నారు. ఇంటివద్దే ఉండండి.. ఫిట్‌గా ఉండండనే సందేశాన్ని కూడా ఇస్తున్నారు. పిల్లలో కలిసి రవితేజ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రవితేజ తన పర్సనల్ విషయాలు ఎక్కువగా ఎక్కడా షేర్ చేసుకోరు. తన ఫ్యామిలీ విషయాలు కూడా ఎక్కడా బయటపెట్టరు. కానీ ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. కాగా, రవితేజ కుమారుడు మహాధన్ రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ వేళ ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు రవితేజ తనవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటి మనకోసంకు రవితేజ రూ. 20 లక్షల విరాళం ఇచ్చారు. సినిమాల విషయానికి వస్తే వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. చదవండి : కష్టాల్లో సినీ కార్మికులు : రవితేజ చేయూత డబుల్ ధమాకా -
‘రౌడీ’ని కలిసిన చోటా మాస్ మహారాజా!
ఒకప్పుడు రౌడీలు అంటే నెగెటివ్‌గా చూసేవారు.. అయితే విజయ్ దేవరకొండ పుణ్యమా అంటూ రౌడీ పదం కాస్తా.. పాజిటివ్‌గా మారి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. మొత్తానికి రౌడీలను హీరోలుగా చేసిన ఘనత విజయ్‌దే అవుతుంది. ఇటీవలే ‘టాక్సీవాలా’ గా వచ్చిన ఈ రౌడీ థియేటర్లలో హల్చల్ చేస్తున్నాడు. ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విజయ్.. రౌడీ బ్రాండెడ్ దుస్తులను మార్కెటింగ్ చేస్తున్నాడు. సినిమా ఫంక్షన్లలో విజయ్ కనిపించే తీరు, ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ విజయ్ దేవరకొండను కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాకుండా రౌడీ బ్రాండెడ్ టీషర్ట్ ధరించి మహాధన్ కూడా పబ్లిసిటీ చేసేస్తున్నాడంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు అభిమానులు. ఇక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కుమారులు కూడా విజయ్ను కలిసి ఫోటోలు దిగారు. విజయ్‌కు యూత్‌లోనే కాదు.. పిల్లల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
రవితేజ వారసుడొస్తున్నాడు
మహాధన్... సన్నాఫ్ రవితేజ. అప్పుడప్పుడూ రవితేజ ఫేస్బుక్లో పోస్ట్ చేసే ఫొటోల్లో చూడడమే తప్ప... సినిమాల్లోనూ, సినీ వేడుకల్లోనూ ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. త్వరలో మహాధన్ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. యస్... రవితేజ వారసుడొస్తున్నాడు. ఓ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘రాజా.. ది గ్రేట్’. ఇందులోనే హీరో చిన్నప్పటి పాత్రలో అంటే చైల్డ్ రవితేజగా మహాధన్ నటిస్తున్నాడు. ఆల్రెడీ మహాధన్పై కొన్ని సీన్లు తీశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదట ఈ పాత్రకు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులను ఆడిషన్ చేశారట! వాళ్లెవరూ అనిల్ రావిపూడికి నచ్చలేదట. ఓ రోజు ఆయన మహాధన్‌ను చూడడం, అతనే ‘రాజా.. ది గ్రేట్’లో హీరో చైల్డ్ ఎపిసోడ్స్‌కి సూటవుతాడని చెప్పడంతో రవితేజ అంగీకరించారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్.


