‘రౌడీ’ని కలిసిన చోటా మాస్‌ మహారాజా! | Raviteja Son Mahadhan Meets Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

Nov 23 2018 8:07 PM | Updated on Nov 23 2018 9:06 PM

Raviteja Son Mahadhan Meets Vijay Devarakonda - Sakshi

ఒకప్పుడు రౌడీలు అంటే నెగెటివ్‌గా చూసేవారు.. అయితే విజయ్‌ దేవరకొండ పుణ్యమా అంటూ రౌడీ పదం కాస్తా.. పాజిటివ్‌గా మారి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. మొత్తానికి రౌడీలను హీరోలుగా చేసిన ఘనత విజయ్‌దే అవుతుంది. ఇటీవలే ‘టాక్సీవాలా’ గా వచ్చిన ఈ రౌడీ థియేటర్లలో హల్‌చల్‌ చేస్తున్నాడు. 

ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విజయ్‌.. రౌడీ బ్రాండెడ్‌ దుస్తులను మార్కెటింగ్‌ చేస్తున్నాడు. సినిమా ఫంక్షన్లలో విజయ్‌ కనిపించే తీరు, ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రస్తుతం మాస్‌ మహారాజా రవితేజ తనయుడు మహాధన్‌ విజయ్‌ దేవరకొండను కలిసి దిగిన ఫోటో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా రౌడీ బ్రాండెడ్‌ టీషర్ట్‌ ధరించి మహాధన్‌ కూడా పబ్లిసిటీ చేసేస్తున్నాడంటూ కామెంట్స్‌ పెట్టేస్తున్నారు అభిమానులు. ఇక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కుమారులు కూడా విజయ్‌ను కలిసి ఫోటోలు దిగారు. విజయ్‌కు యూత్‌లోనే కాదు.. పిల్లల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్‌ ఉందని తెలుస్తోంది. విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement