ఆరు స్క్రీన్లతో భారీ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తున్న రవితేజ | Sakshi
Sakshi News home page

ఆరు స్క్రీన్లతో భారీ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తున్న రవితేజ.. ఎక్కడో తెలుసా?

Published Fri, Feb 23 2024 7:25 AM

Ravi Teja Start Big Multiplex - Sakshi

మ‌హేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ బాట‌లోనే ర‌వితేజ అడుగులు వేయ‌బోతున్నాడు. థియేట‌ర్ బిజినెస్‌లోకి ఆయన ఎంట్రీ ఇస్తున్నాడు. మొదట మహేశ్‌ బాబు ఈ రంగంలో అడుగు పెట్టారు. AMB  పేరుతో ఏషియ‌న్ సినిమాస్ వారి భాగస్వామ్యంలో ఆయన గచ్చిబౌలిలో భారీ మల్టీఫ్లెక్స్‌ నిర్మించారు. బెంగుళూరులో కూడా మరో థియేటర్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.

అల్లు అర్జున్‌ AAA పేరుతో అమీర్‌పేటలో ఒక మల్టీఫ్లెక్స్‌ను నిర్మించారు. విజయ్‌ దేవరకొండ మహబూబ్‌నగర్‌లో AVD పేరుతో మూడు స్క్రీన్స్‌తో ఉన్న థియేటర్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ స్టార్‌ హీరోలు అందరూ కూడా ఏషియ‌న్ సినిమాస్‌తో భాగస్వామ్యంతో ఈ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు.

ఇప్పుడు రవితేజ కూడా ఏషియ‌న్ సినిమాస్‌ వారితో కలిసి ఒక మల్టీఫ్లెక్స్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మల్టీఫ్లెక్స్‌లో ఆరు స్క్రీన్స్‌ వుంటాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మ‌ల్టీప్లెక్స్‌కు ఏషియ‌న్ ర‌వితేజ పేర్లు కలిసి వచ్చేలా ART సీనిమాస్ అనే పేరు పెట్ట‌బోతున్న‌ట్లు తెలిసింది.  టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్క‌రుగా థియేట‌ర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Advertisement
Advertisement