పెద్ద‌ప‌నులు చేయాల‌నుకునే అమ్మాయి అలా చేయ‌దు: ర‌ష్మిక‌ | Rashmika Mandanna New Post On Twitter | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఆ మాట నాకు సరిపోతుంది

Jun 17 2021 12:35 AM | Updated on Jun 17 2021 9:06 PM

Rashmika Mandanna New Post On Twitter - Sakshi

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్న రష్మికా మందన్న బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ఒకేసారి రెండు హిందీ సినిమా (గుడ్‌ బై, మిస్టర్‌ మజ్ను)ల్లో నటిస్తున్నారు. మూడో హిందీ సినిమా కూడా సైన్‌ చేశారు. ప్రస్తుతం ముంబైలో ‘గుడ్‌ బై’ చిత్రీకరణలో పాల్గొంటున్న రష్మిక చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. ‘‘పెద్ద పనులు చేయాలనుకునే అమ్మాయి చిన్న చిన్న విషయాలను తన దగ్గరకు రానివ్వదు అని ఎవరో చెప్పారు.. ఆ మాట నాకు కరెక్ట్‌గా సరిపోతుంది’’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారామె.

ఇలా అన్నారంటే రష్మిక పెద్ద పెద్ద కలలు కంటారని అర్థమవుతోంది. అలాగే లక్ష్యాలు కూడా పెద్దవిగానే ఉంటాయని అనిపిస్తోంది. బహుశా హీరోయిన్‌గా ఎంటర్‌ అయినప్పుడు పెద్ద స్థాయికి చేరుకోవాలని అనుకుని ఉంటారు. అందుకు తగ్గ కృషి చేసి, తక్కువ టైమ్‌లో పెద్ద స్థాయికి చేరుకున్నారు. మరి.. రష్మిక అన్న పెద్ద పనుల జాబితాలో ఏమేం ఉన్నాయో తనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement