
ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్‌లో ఎక్కువగా సక్సెస్ అయిన హీరోయిన్ రష్మిక. గత కొన్నేళ్లలో యానిమల్, ఛావా, పుష్ప 2 తదితర చిత్రాలతో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒకే తరహా చిత్రాలు అని కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'గర్ల్ ఫ్రెండ్' అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ, అలానే 'థామా' అనే హారర్ చిత్రంలోనూ చేస్తోంది.
'థామా' హిందీ సినిమా. ఇందులో వ్యాంపైర్ తరహా పాత్ర రష్మిక కనిపిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలానే దెయ్యంగానూ కనిపించే అవకాశాలున్నాయని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో తీసే హారర్ చిత్రంలోనూ రష్మికకు క్రేజీ ఆఫర్ వచ్చిందని, ఇందులో ఈమె దెయ్యంగా నటించనుందని అంటున్నారు. ఇదంతా కాంచన 4 కోసమే అని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పెరగడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: నిన్ను ఎప్పటికీ మిస్ అవుతా.. వెంకటేశ్ ఎమోషనల్)
కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారిన రాఘవ లారెన్స్.. 'కాంచన' సిరీస్‌తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగో భాగం షూటింగ్ జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ విషయాన్ని ఇదివరకే బయటపెట్టారు. ఇప్పుడు రష్మిక కూడా ఈ ప్రాజెక్టులో భాగమైందని, దెయ్యంగా కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
సాధారణంగా కాంచన సిరీస్ సినిమాల్లో ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఉంటారు. రూమర్స్ బట్టి చూస్తుంటే రష్మిక.. దెయ్యం పాత్ర చేయడం నిజమేనేమో అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం రష్మికని ఎలా చూపిస్తారనే ఆసక్తి కచ్చితంగా ఏర్పడుతుంది.
(ఇదీ చదవండి: వివాదంలో సుమ కొడుకు సినిమా.. బండి సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్)