ప్రభాస్‌, మహేశ్‌, తారక్‌ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా! | Rasha Thadani: I enjoy South Movies are Larger than Life | Sakshi
Sakshi News home page

Rasha Thadani: సౌత్‌ సినిమాలు చూడటాన్ని ఎంజాయ్‌ చేస్తా!

Mar 30 2026 3:20 PM | Updated on Mar 30 2026 3:32 PM

Rasha Thadani: I enjoy South Movies are Larger than Life

స్టార్‌ హీరోయిన్‌ రవీనా టండన్‌ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్‌)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఇక ఆజాద్‌ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్‌తో ఇరగదీసి సెన్సేషన్‌ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్‌బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.

సౌత్‌ సినిమాలంటే ఇష్టం
ఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నాను.

హీరోయిన్స్‌ కూడా..
హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్‌ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.

చదవండి: బాలీవుడ్‌ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement