రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్‌పై సస్పెన్స్ | Ram Charan Peddi Movie trailer is ready to release Suspense on third look | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్‌పై సస్పెన్స్

May 6 2026 11:32 PM | Updated on May 6 2026 11:34 PM

Ram Charan Peddi Movie trailer is ready to release Suspense on third look

రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్‌గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్‌లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది.  

తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్‌లో మూడో లుక్‌ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్‌లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్‌. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్‌లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది.  

‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్‌ మూడో లుక్‌  ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement