భర్త గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్

Rakhi Sawant Shares Shocking Comments On Her Marriage - Sakshi

బోల్డ్‌, కాంట్రవర్సీ క్వీన్‌గా పేరొందిన నటి రాఖీ సావంత్‌ హిందీ బిగ్‌బాస్‌ సీజన్ ‌14లో "ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది హౌస్"‌ అన్న బిరుదును సొంతం చేసుకుంది. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించే రాఖీ.. నిన్నటి ఎపిసోడ్‌లో గతాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యింది. తన తల్లికి గుండెపోటు వచ్చినప్పుడు చికిత్స చేయించడానికి డబ్బులు లేకపోవడంతో స్నేహితులను సహాయం కోరానని, దీన్ని అవకాశంగా తీసుకొన్న ఓ వ్యక్తి కారులో తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడని చెబుతూ బోరున విలపించింది. అంతేకాకుండా తన భర్త రితేష్‌కు ఇది వరకే పెళ్లయి, ఒక బిడ్డ కూడా ఉన్నాడని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తనకు విడాకులు ఇస్తానంటూ భర్త పలుమార్లు బెదిరించాడని పేర్కొంది. రాఖీ నవ్వుల వెనక ఇంతటి బాధ ఉందని తెలిసి అక్కడే ఉన్న కంటెస్టెంట్‌, సింగర్‌ రాహుల్‌ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. (బిగ్‌బాస్‌: రాఖీ సావంత్‌ విపరీత చేష్టలు)

కాగా రాఖీ 2018 నవంబర్‌లో టీవీ నటుడు దీపక్ కలాల్‌ను పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అయితే అనూహ్యంగా డిసెంబర్‌31నే దీపక్‌ మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని, కాబట్టి అతడిని పెళ్లి చేసుకోనని రాఖీ సెన్సేషనల్‌‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో యూకేకు చెందిన రితేష్ అనే బిజినెస్‌మెన్‌ పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు ఇప్పటి వరకు బయటకు రాకపోవడం గమనార్హం.  (అతడితో ప్రేమలో ఉన్నాను: నటి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top