క్షీణించిన నిర్మాత ఆరోగ్యం.. సాయం చేయాలని వీడియోలో ఆవేదన.. స్పందించిన లారెన్స్‌

Raghava Lawrence Financial Help To Tamil Producer Va Durai - Sakshi

చెన్నై: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు. విక్రమ్‌, సూర్య కలిసి నటించిన పితామహన్‌ వంటి సంచలన విజయం సాధించిన చిత్రంతో పాటు విజయకాంత్‌ హీరోగా నటించిన గజేంద్ర తదితర భారీ చిత్రాలను నిర్మాత విఏ.దురై. చివరిలో నిర్మించిన చిత్రాలు ప్లాప్‌ కావడంతో నష్టాల పాలయ్యారు.

కాగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నటుడు రజనీకాంత్‌ కూడా సాయం చేస్తానని చెప్పారు.

రాఘవ లారెన్స్‌ నిర్మాత పరిస్ధితి గ్రహించి బుధవారం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. కాగా లారెన్స్‌ కథానాయకుడిగా నటించిన రుద్రన్‌ చిత్రం తమిళ ఉగాది సందర్భంగా ఇవాళ ఏప్రిల్ 14న విడుదలైంది.
చదవండి: ‘రుద్రన్‌’కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top