టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దేవర సినిమా భారీగా లాభాలు అందించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న కొత్త సినిమా గర్ల్ఫ్రెండ్కు ఆయన నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో బేబీ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సినిమాలను ధీరజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. తాను ఎక్కువగా క్రిష్ణా, గుంటూరు, సీడెడ్‌లలో చాలా సినిమాలను డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగారు.
'దేవర'తో లాభాలు
ప్రముఖ నిర్మాత నాగవంశీతో తనకు ఎక్కువ అనుబంధం ఉన్నట్లు ధీరజ్ పేర్కొన్నారు. వంశీతో ఉన్న పరిచయం వల్ల దేవర సినిమాను క్రిష్ణా, అనంతపురం జిల్లాలలో డిస్టిబ్యూటర్గా విడుదల చేశానన్నారు. అయితే, తాను అనుకున్న లాభం కంటే ఎక్కువగానే వచ్చినట్లు ఆయన ఇలా తెలిపారు. 'దేవర సినిమా చాలామందికి డబ్బులు మిగిల్చింది. అయితే, ఒకరిద్దరు నష్టపోయి ఉండొచ్చు కూడా.. వారికి ఏదోరూపంలో వంశీ న్యాయం చేస్తారు. నాగవంశీ సినిమాలు తీసుకున్నవారు ఎవరూ నష్టపోరు. ఒకవేళ ఎవరైనా నష్టపోతే వారిన తప్పకుండా ఆదుకుంటారు. ఇండస్ట్రీలో ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్స్ను ఆదుకునే ఏకైక నిర్మాత నాగవంశీ మాత్రమే.. కానీ, వార్2 సినిమాతో మాతో పాటు ఆయన కూడా భారీగా నష్టపోయారు. వార్2 మూవీ బాలీవుడ్ వాళ్లది కాబట్టి నష్టపోయిన వారికి ఆయన కూడా ఏం చేయలేకపోయారు. అయినప్పటికీ ఏదో రూపంలో న్యాయం చేస్తారు.' అని ధీరజ్ అన్నారు.
'ఓజీ' ఎందుకు కొనలేదంటే..
ఏపీలో ఓజీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని తాను అనుకున్నట్లు ధీరజ్ ఇలా చెప్పారు. క్రిష్ణా జిల్లాలో ఓజీ డిస్ట్రిబ్యూట్ కోసం ఏకంగా రూ. 12 కోట్లు అడిగడంతో రిష్క్ చేయడం ఎందుకని వదిలేసినట్లు ఇలా తెలిపారు. 'ఓజీ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. కానీ, అంతకు మించి ఎక్కువ ఢీల్స్ జరిగాయి. ఓజీ మేకర్స్ చెప్పిన మొత్తానికి కొంటే నష్టం తప్పదని వదిలేశాను. మొదటిరోజు భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్లో రూ. 5 కోట్లకు పైగా కలెక్షన్స్ రావచ్చని ఒక అంచనా ఉంది. కానీ, ఓజీ కోసం రూ. 12 కోట్లు అడగడంతో వద్దని వదిలేశాను. అని ధీరజ్ చెప్పారు. అయితే, బాక్సాఫీస్ లెక్కల ప్రకారం క్రిష్ణా జిల్లాలో ఓజీ రూ. 8 కోట్లు రాబట్టిందని సమాచారం.


