'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ? | Present Situation Of Chiranjeevi Vishwambhara Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరంజీవి సినిమాకు మోక్షం ఎప్పుడు? ఇప్పుడేంటి పరిస్థితి?

May 28 2026 4:52 PM | Updated on May 28 2026 5:15 PM

Present Situation Of Chiranjeevi Vishwambhara Movie

పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల సినిమాలకు సమస్యలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా రిలీజ్ అవడానికి నానా పాట్లు పడుతుంటే ఏమనుకోవాలి. అవును 'విశ్వంభర' గురించే ఈ డిస్కషన్. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. భారీ బడ్జెట్, సోషియో ఫాంటసీ ‍స్టోరీ అని ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. తీరా చూస్తే థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇంతకీ 'విశ్వంభర' రిలీజ్ ఎక్కడివరకు వచ్చింది?

(ఇదీ చదవండి: మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌ 'త్రికాల' రివ్యూ)

చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చాన్నాళ్ల క్రితం మొదలైన సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్ దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిందని రూమర్స్ వచ్చాయి. అయితే రెండున్నరేళ్ల క్రితం టీజర్ రిలీజైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఘోరాతీఘోరంగా విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ అంతా పునరాలోచనలో పడిపోయింది.

తర్వాత మరో వీడియో రిలీజ్ చేశారు. ఓ పాట వదిలారు. అయినా సరే బజ్ రాలేదు. దీని షూటింగ్ గతేడాది పూర్తి చేసిన చిరంజీవి.. అనిల్ రావిపూడితో 'మన శంకరవరప్రసాద్' సినిమా చేశారు. ఇది రిలీజై 5 నెలలు దాటేసింది. విశ్వంభర చిత్రం ఈ ఏడాది వేసవిలో రావొచ్చని కొన్ని నెలల క్రితం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు వేసవి కూడా దాదాపు అయిపోవచ్చింది. కానీ చిరు మూవీ సంగతేంటనేది ఎవరికీ తెలీదు.

అదుగో ట్రైలర్, ఇదుగో మూవీ రిలీజ్ డేట్ అని పలు సందర్భాల్లో రూమర్స్ వస్తున్నాయి. కానీ వీటిని జనాలు లైట్ తీసుకుంటున్నారు. చూస్తుంటే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌కే ఈ చిత్రంపై దాదాపుగా ఇంట్రెస్ట్ పోయినట్లు అనిపిస్తుంది. రీసెంట్‌గానే బాబీ దర్శకత్వంలో కొత్త సినిమాని మొదలుపెట్టిన చిరు.. దీని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు 'పెద్ది' విషయంలో ఏర్పడిన పర్సంటేజీ సమస్యని కూడా పరిష్కరించారు. కానీ 'విశ్వంభర' విషయంలో ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఈ ఏడాదిలోనైనా మూవీ రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారపోయింది.

(ఇదీ చదవండి: చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం)

Advertisement
 
Advertisement
Advertisement