ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆరు హెలికాప్టర్లతో సెల్యూట్‌.. వీడియో అదుర్స్‌ | Prabhas Fans A Cinematic Air Salute | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆరు హెలికాప్టర్లతో సెల్యూట్‌.. వీడియో అదుర్స్‌

Dec 16 2023 8:44 AM | Updated on Dec 16 2023 12:44 PM

Prabhas Fans A Cinematic Air Salute - Sakshi

ప్రపంచవ్యాప్తంగా సలార్‌ జోరు ఒక్కసారిగా పెరిగింది. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు సలార్‌ రానుంది. దీంతో ఒక్కసారిగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ కార్యక్రమాలు పెరిగాయి. నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా ప్రచారం జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో సలార్‌ గురించి ఆసక్తికర విషయాలను షేర్‌ చేస్తున్న సమయంలో.. డైనోసార్‌ ప్రభాస్‌ కూడా ఎంట్రీ ఇచ్చి సినిమాపై పలు ఆసక్తకరమైన విషయాలను పంచుకున్నాడు.

ఇదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డార్లింగ్‌పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. తాజాగా కెనడాలోని ప్రభాస్​ అభిమానులు వినూత్నంగా భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. హెలికాప్టర్లతో ప్రభాస్​​కు ఎయిర్​ సెల్యూట్​ చేశారు. కెనడాలోని టొరొంటోలో పచ్చన మైదానంలో ప్రభాస్‌ భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసుకుని... ఆ సమయంలో ఒక్కసారిగా ఆరు హెలికాప్టర్లు గాల్లోకి ఎగురుతాయి..

అవన్నీ సెల్యూట్‌ చేస్తున్నట్లుగా వారు వీడియోను క్రియేట్‌ చేశారు. ఏంతో కష్టపడి ప్రభాస్‌పై అభిమానంతో వారు ఆ వీడియోను అద్భుతంగా రూపొందించారు. హొంబలే ఫిల్మ్స్​ సోషల్‌ మీడియాలో  దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోను ఫ్యాన్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement