అసలేం జరిగింది? మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?

Pawan Kalyan And His Third Wife Anna Lezhneva Decided To Seperate, Divorce Rumours Goes Viral - Sakshi

ఏ ఫంక్షన్‌ అయినా ఒంటరిగానే పీకే

ఇటీవల పవన్‌ కల్యాణ్‌తో కనిపించని అన్నా

సింగపూర్‌కు మకాం మార్చి ఉండొచ్చని వార్తలు

పవన్‌ కల్యాణ్‌.. రాజకీయాల్లోకి రాకముందే వివాదాలతో వార్తల్లోకొచ్చిన వ్యక్తి. పార్టీ పెట్టి పదేళ్లయినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా.. సభల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుని నీతులు చెబుతారు. కానీ సొంత కుటుంబం విషయంలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు.

పవన్‌ కల్యాణ్‌  వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. కొన్ని అధికారికం. మరికొన్ని అనధికారికం. పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్‌ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. 1997లో నందినిని పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణూ దేశాయ్ ను పవన్ కల్యాణ్ ప్రేమించి 2009లో కలిసి జీవితం ప్రారంభించారు. వీరికి ఇద్దరు పిల్లలు. అకీరా నందన్, ఆద్య. అయితే 2012 నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. 

ఆ తర్వాత 2013లో పవన్ కల్యాణ్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పాప పేరు పొలెనా అంజనా పవనోవా, తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్. గత కొన్నేళ్లుగా పవన్‌, అన్నా లెజినోవాతోనే కలిసి ఉంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌తో మూడో భార్య అన్నా కూడా దూరంగా ఉంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పిల్లలతో అన్నా లెజినోవా సింగపూర్‌లో ఉంటున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. 

మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా!
పవన్‌ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యమైన వేడుకల్లో ఆమె కనిపించకపోవడం కూడా ఆ పుకార్లకు ఆజ్యం పోసింది. కొన్నాళ్ల క్రితం మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరగ్గా.. ఆ వేడుకకు పవన్‌ కల్యాణ్‌ ఒక్కడే హాజరయ్యాడు. మిగిలిన మెగా హీరోలంతా తమ కుటుంబంతో కలిసి వస్తే.. పవన్‌ సింగిల్‌గానే వెళ్లాడు.అలాగే రామ్‌ చరణ్‌- ఉపాసనలకు కూతురు పుడితే కూడా చూడడానికి అన్నా లెజినోవా వెళ్లలేదు. ఇటీవల జరిగిన ఊయల వేడకలో కూడా ఆమె కనిపించకోవడంతో విడాకుల ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. 

పవన్‌ రాజకీయాలకు అన్నా దూరం
గతంలో పవన్‌ పర్యటనల్లో అన్నా కనిపించేది. పవన్‌ ఎక్కడైనా పర్యటన ప్రారంభించాలనుకున్నప్పుడు అన్నాతో పూజాకార్యక్రమాలు నిర్వహించేలా జాగ్రత్త పడేవారు. తాజాగా వారాహి యాత్ర ఆరంభంలో ఎక్కడా అన్నా కనిపించలేదు. 

ప్రస్తుతం అన్నా లెజినోవా పిల్లలతో కలిసి సింగపూర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. పవన్‌తో విబేధాలు రావడంతో ఇకపై అతనికి దూరంగా ఉండాలని డిసైడ్‌ అయ్యారట. తుది నిర్ణయం తర్వాత అన్నా లెజినోవా రష్యాకు మకాం మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే పవన్‌ కానీ, అన్న లెజినోవా కాని స్పందించే వరకు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top