ఫోటోలో ఉన్న పాలబుగ్గల పసివాడు ఎవరో తెలుసా? | Pathaan Hero Sharukh Khan Childhood Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ పాలబుగ్గల చిన్నారి.. ఇప్పుడేమో బాక్సాఫీస్‌నే షేక్ చేస్తున్నాడు..!

Published Mon, Jan 30 2023 3:00 PM | Last Updated on Mon, Jan 30 2023 6:05 PM

Pathaan Hero Sharukh Khan Childhood Photos Goes Viral - Sakshi

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? చాలా క్యూట్‌గా కనిపిస్తున్న పాల బుగ్గల ఆ పసివాడు ఎవరో తెలుసా? సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు అని మీకు తెలుసా? అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడ్డోడు అందరి కలల రాకుమారుడిగా ఎదిగాడు. చలనచిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ స్టార్ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. 

ఆ పాలబుగ్గల చిన్నారి మరెవరో కాదు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ను ఓ ఆటాడుకుంటున్న బాలీవుడ్‌ బాద్‌షా షారూక్ ఖాన్. ఆయన నటించిన చిత్రం పఠాన్ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా ఆయన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించిన స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్ థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.550 కోట్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో మరో హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సందర్భంగా  స్టార్ హీరో చిన్ననాటి ఫోటోలు వైరల్‌గా మారాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement