చరణ్‌, నాని.. షేర్‌ ఎవరు..? | The Paradise Aaya Sher song Record created on Peddi Chikiri Chikiri | Sakshi
Sakshi News home page

చరణ్‌, నాని.. షేర్‌ ఎవరు..?

Apr 6 2026 8:43 AM | Updated on Apr 6 2026 8:58 AM

The Paradise Aaya Sher song Record created on Peddi Chikiri Chikiri

ది ప్యారడైజ్‌ సినిమాలోని ఆయా షేర్‌ పాట ప్రేక్షకులను మెప్పించింది. యూట్యూబ్ లైక్‌ల విషయంలో రామ్ చరణ్ ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ పాటను చాలా తక్కువ సమయంలోనే అధిగమించింది. డిజిటల్ వ్యూస్‌ పరంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’.  ఇందులోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) అంటూ సాగే ఈ పాట 24గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్‌ సాధించిన తొలిసాంగ్‌గా రికార్డు నెలకొల్పింది.

ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘పెద్ది’ పాట (తెలుగు) నాలుగు నెలల్లో 13,32,838 లైక్‌లను సాధించింది. దీనితో పోలిస్తే, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్ (తెలుగు)’ పాట విడుదలైన కేవలం ఒక నెలలోనే 13,35,424 లైక్‌లను దాటింది.  సంఖ్యాపరంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ లాంగ్‌ రన్‌లో మరింత  ఈ నంబర్‌ పెరగవచ్చు. 

అయితే, వ్యూస్‌ పరంగా చికిరి పాట 197 మిలియన్లు సాధించి టాప్‌లో ఉంది... ఆయా షేర్‌ పాట 91 మిలియన్ల వ్యూస్‌ రాబట్టింది.  ‘చికిరి చికిరి’ పాటకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదరణ లభించగా, ‘ఆయా షేర్’ ప్రారంభంలో మాత్రమే జోరు చూపింది. అయితే, ఇప్పటికీ రామ్‌ చరణ్‌ చికిరి పాటనే టాప్‌లో కొనసాగుతుంది. పెద్ది సినిమా ఏప్రిల్‌ 30న విడుదల కానుండగా.. ది ప్యారడైజ్‌ చిత్రం ఆగస్టు 21న రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement