కేజీయఫ్ 3లో మరో హీరో.. స్వాతంత్య్రానికి ముందు నరాచిలో ఏం జరిగింది?

Pa Ranjith Period Film With Vikram, Set In KGF - Sakshi

కేజీయఫ్ అనగానే కళ్లముందుకు రాఖీభాయ్ వచ్చేస్తాడు. సలాం రాఖీభాయ్ అనే కటౌట్ కనిపిస్తుంది. ప్రశాంత్‌ నీల్ మేకింగ్ లో హై వోల్డేజ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు భాగాలు వస్తే.. రెండింటినీ సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశారు ప్రేక్షకులు. కేజీయఫ్‌2 అయితే  ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది.  ఇదే జోష్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యశ్ మూడో భాగాన్ని తీసుకొస్తారని  కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు  కేజీయఫ్‌ ఫ్యాన్స్. ఈసారి రాఖీ భాయ్ మరింత రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కేజీయఫ్‌3 లో రాఖీభాయ్  కాకుండా మరో హీరో నటించబోతున్నాడు. పార్ట్‌ 3లోకి చియాన్ విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

రీసెంట్ గా తమిళ దర్శకుడు పా. రంజిత్ తో కొత్త సినిమాను ప్రారభించాడు విక్రమ్. త్రీడీ ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది.  అది సరే, ఈ సినిమాకు, కేజీయఫ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఇండిపెన్డెన్స్‌కు ముందు నరాచిలో జరిగిన ఆచారకాలపైనే పా.రంజిత్ దృష్టిపెడుతున్నాడని సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది ప్రశాంత్‌ నీల్ చూపించాడు. ఇప్పుడు స్వాతంత్య్రం రాకముందు కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది పా.రంజిత్ చూపించబోతున్నాడట.

(చదవండి: పుష్ప-2లో పాపులర్‌ బాలీవుడ్‌ నటుడు)

మరోవైపు కేజీయఫ్ 3 పై ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 3తో తిరిగొస్తామని అభిమానులకు మాట ఇచ్చాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత టైగర్ తో ప్లాన్ చేస్తోన్న మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాతే కేజీయఫ్ 3 తీసుకొస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ లోపే విక్రమ్ కేజీయఫ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top