ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్‌' తెలుగు వర్షన్‌ వచ్చేసింది | Oppenheimer Telugu Version Movie Streaming Started In This OTT Platform, Deets Inside - Sakshi
Sakshi News home page

Oppenheimer Telugu Movie OTT Release: ఆస్కార్‌ సినిమా 'ఓపెన్‌హైమర్‌' ఓటీటీలో తెలుగు వర్షన్‌ వచ్చేసింది

Published Sun, Mar 24 2024 7:56 AM

Oppenheimer Movie Streaming Now Telugu - Sakshi

హాలీవుడ్‌  బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ తెలుగు అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఈ హిట్‌ సినిమా తాజాగా ఓటీటీలో తెలుగు వర్షన్‌ అందుబాటులోకి వచ్చేసింది. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్  జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్‌ హైమర్‌’ను రూపొందించారు. 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఇంగ్లీష్‌,హిందీ వర్షన్‌లో రూ. 119 రెంట్‌ విధానంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓపెన్‌హైమర్‌.. మార్చి 21 నుంచి జియో సినిమాలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్,తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జియో సినిమా వినియోగదారులు అయితే ఎలాంటి రెంట్‌ లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు.

96వ ఆస్కార్‌ వేడుకల్లో  ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్‌ నోలన్‌, ఉత్తమ నటుడిగా సిలియన్‌ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. రూ. 835 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.7,600 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement