Samantha Brutally Trolled For Fake Accent At Citadel London Premiere, Video Viral - Sakshi
Sakshi News home page

Samantha: సిటాడెల్‌ ప్రీమియర్‌లో సమంత.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!

Published Mon, Apr 24 2023 10:16 PM

Netizens Trolls On Samantha Fake Excitement In London Citadel - Sakshi

సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. ‍అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ వెబ్ సిరీస్‌ ఇండియన్ వెర్షన్‌లో నటించింది. ఈ సిరీస్ ఈనెల 28న రిలీజ్‌ కానుండడంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ప్రీమియర్‌ కార్యక్రమంలో సమంత సరికొత్త లుక్‌లో కనిపించారు. బ్లాక్‌ డ్రెస్‌, ఖరీదైన డైమండ్ నగలతో వేదికపై మెరిసింది. 

అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్‌పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు నెగెటివ్‌గా పోస్టులు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో తాను భాగం కావడం పట్ల సామ్ తన కాస్తా ఎక్కువగానే ఎగ్జైట్ ‌మెంట్ ప్రదర్శించింది. కానీ కొత్తగా ఈ ఫేక్ యాక్సెంట్  అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మారుతుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement