'సరైన వ్యక్తుల వల్లే మీరేంటో తెలుసుకుంటారు': నేషనల్ క్రష్ National Crush Rashmika Mandanna latest Post Goes Viral | Sakshi
Sakshi News home page

'నా లైఫ్‌లో అనుకున్నదే జరిగింది'.. రష్మిక పోస్ట్ వైరల్!

Published Fri, Dec 29 2023 7:05 PM

National Crush Rashmika Mandanna latest Post Goes Viral - Sakshi

యానిమల్‌ సినిమాతో హిట్‌ కొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పుష్ప సినిమాతో శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామ.. పుష్ప-2లోనూ నటిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. జీవితంలో కొన్నిసార్లు అగి ఆలోచించాలంటూ పోస్ట్ చేసింది. 

రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'జీవితం గురించి కొన్నిసార్లు ఆగి ఆలోచించాలి. అదంతా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలేందుకు ఇదంతా జరిగిందని. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఇదంతా జరిగినందుకు ప్రశాంతంగా, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే.. ఇదే నేను ఎప్పటినుంచో కలలు కనేది. కానీ నేను ఇదంతా జరుగుతుందని నేను గ్రహించలేదు. అంతే కాదు నాకు ఏం కావాలో తెలియని దాని వైపు పరుగులు తీస్తూనే ఉంటా. సరైన వ్యక్తులతో ఉండటం వల్ల మీరు కొన్నిసార్లు ఆగి.. దాన్ని గ్రహించాల్సి ఉంటుందని మీరు తెలుసుకుంటారు. ఈ లిటిల్ అమ్మాయి కలలు కంటూ పెరిగింది కూడా ఇదే!' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు నేషనల్ క్రష్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement