Actor Nasser Counter To Pawan Kalyan Comments On Bollywood - Sakshi
Sakshi News home page

Nasser Counter To Pawan: పవన్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.. అందుకే ఈ వ్యాఖ్యలు: నాజర్‌

Jul 27 2023 6:50 PM | Updated on Jul 27 2023 7:11 PM

Nasser Counter To Pawan Kalyan Comments On Bollywood - Sakshi

హైదరాబాద్‌లో జరిగిన 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో టాలీవుడ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌​ తమిళ చిత్ర పరిశ్రమపై పలు వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి కోలీవుడ్‌ పరిశ్రమ చాలా నేర్చుకోవాలని ఆయన కామెంట్‌ చేశారు. తమిళ పరిశ్రమలో తమిళులు మాత్రమే నటించాలనే ధోరణి నుంచి బయటకు రావాలని అక్కడి పరిశ్రమ పెద్దలకు సూచించారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది. అలాగా అందరినీ అక్కున చేర్చుకుంటుందని పవన్‌ అన్నారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో కూడా మార్పు రావాలని ఆయన సూచించారు.

(ఇదీ చదవండి: ఏంటి పవన్‌ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్‌లో..!)

ఇతర భాషలకు చెందిన నటులను కూడా కోలీవుడ్‌లో తీసుకోవాలని ఆయన ఇలా తెలిపారు. 'కేవలం మన భాషా, మనవాళ్లే ఉండాలంటే కుచించుకుపోతాం. తమిళ చిత్ర పరిశ్రమలో కేవలం తమిళవాళ్లే ఉండాలనే భావన ఆ చిత్ర పరిశ్రమ పెద్దలకు ఉందని నేను బయట విన్నాను. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటికి వచ్చి, విస్తృత పరిధిలో మీరు కూడా RRR లాంటి సినిమాలు, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని కోరుకుంటున్నాను' అని తమిళ పరిశ్రమపై పవన్ కల్యాణ్‌ కామెంట్‌ చేశారు.

పవన్‌ వ్యాఖ్యలకు  నాజర్ కౌంటర్‌
పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటులు నాజర్ తాజాగా ఖండించారు. 'తమిళ చిత్ర పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు.  పవన్ కల్యాణ్‌ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల రక్షణ కోసం సెల్వమణి  కొన్ని సూచ‌న‌లు చేశారు. తమిళ సినిమా పరిధిలో మాత్రమే మూవీ చేస్తున్నప్పుడు ఇక్కడి టెక్నీషియన్లను మాత్రమే కొంత వరకు ఎంకరేజ్‌ చేయండి అన్నారు.

అంతే కానీ ఇతర భాషల నటులను  వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు అన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలు అయ్యాయి. దీంతో పాటుగా ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి సమయంలో అటువంటి నిబంధనలను ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రప్రదేశ్‌ అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం.' అని నాజర్‌ అన్నారు.


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement