హాయ్‌ నాన్నతో ప్రేమలో పడతారు | Sakshi
Sakshi News home page

హాయ్‌ నాన్నతో ప్రేమలో పడతారు

Published Sat, Nov 25 2023 4:25 AM

Nani Hi Nanna traile Launch - Sakshi

‘‘సినిమా అనేది నాకు ఆక్సిజన్‌తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా... డిసెంబర్‌ 7న మీరంతా(అభిమానులు) ప్రేమలో పడిపోయే ‘హాయ్‌ నాన్న’ వస్తోంది.. ఆ బాధ్యత నాది, మా టీమ్‌ది. బాక్సాఫీసు వద్ద హిట్‌ చేసే బాధ్యత మీది’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించారు.  వైర ఎంటర్‌టై¯Œ మెంట్‌పై మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్‌ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో నాని మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడు ‘వీడెవడో బావున్నాడు’ అనిపించింది ‘హాయ్‌ నాన్న’ సినిమాకే(నవ్వుతూ). శౌర్యువ్‌ సినిమా బాగా తీశాడు. టీజర్, ట్రైలర్‌లో చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో శౌర్యువ్, మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి, రచయిత కాశి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్‌ వర్గీస్, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:
సతీష్‌ ఈవీవీ.   
∙చెరుకూరి మోహన్, నాని, శౌర్యువ్, విజయేందర్‌ రెడ్డి

Advertisement
 
Advertisement