ఎమోషన్ అంతా క్రికెట్‌ గ్రౌండ్‌లోనే.. .. తమన్‌ హార్ట్‌ టచ్చింగ్‌ స్టోరీ | Music Director Thaman Heart Touching Story Goes Viral On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ గ్రౌండ్‌లో ఏడ్చేవాడిని.. తమన్‌ హార్ట్‌ టచ్చింగ్‌ స్టోరీ

Published Thu, Jun 20 2024 3:53 PM | Last Updated on Thu, Jun 20 2024 5:31 PM

Music Director Thaman Heart Touching Story Goes Viral

తమన్‌..ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌. చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిపోయాడు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరోలందరికి హుషారెత్తే మ్యూజిక్ అందించాడు.డ్రమ్మర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. అయితే తమన్‌ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. తన ఎమోషన్‌ అంతా దాచుకొని క్రికెట్‌ గ్రౌండ్‌లో చూపించేవాడట. 

ఇండియన్ ఐడడ్‌ సీజన్ 3 లాంచింగ్‌ ఎపిసోడ్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆహాలో స్క్రీమ్‌ అవుతున్న ఈ మ్యూజికల్ రియాలిటీ షోకి తమన్‌తో పాటు కార్తిక్, గీతా మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. షో మధ్యలో ఓ సందర్భంలో ‘మీ జీవితంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా?’అని గీతా మాధురి అడిగిన ప్రశ్నకు బదులుగా  ''జీవితంలో తాను ఎన్నోసార్లు  ఏడిచాను. నా ఎమోషన్ అంతా  క్రికెట్ గ్రౌండ్ లో  ఉంటుంది'అని తన ఎమోషన్ ని దాచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత గీతా మాధురి తమన్ అమ్మగారిని గురించి ప్రస్థావించినపుడు.. గతాన్ని బాల్యన్ని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తమన్.తమన్ లోని ఎమోషన్ కోణాన్ని టచ్ చేసిన ఈ వీడియో నెటిజన్స్‌ని  కదిలిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement