ఓటీటీలోకి వచ్చేసిన ‘మయసభ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | MayaSabha Web Series Now Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన ‘మయసభ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Aug 7 2025 12:02 PM | Updated on Aug 7 2025 12:10 PM

MayaSabha Web Series Now Streaming On This OTT Platform

వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించిన వెబ్సిరీస్‌ ‘మయసభఓటీటీలోకి వచ్చేసింది. ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్నేటి(ఆగస్ట్‌ 7) నుంచి ప్రముఖ ఓటీటీ సోనీలివ్లో స్ట్రీమింగ్అవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా వెబ్సిరీస్ని తెరెక్కించారు. తొమ్మిది ఎపిసోడ్ల సిరీస్‌ ఇది. కొన్ని ఎపిసోడ్లు దాదాపు 30 నిమిషాల నిడివితో రూపొందగా మరికొన్ని 50 నిమిషాల రన్‌టైమ్‌తో తెరకెక్కాయి. 

ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు. జీవితంలో ఏదో సాధించాలి, ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇద్దరు స్నేహితుల దారులు ఎలా మారాయి? చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారే.. రాజకీయ గమనంలో ప్రత్యర్థులుగా ఎలా మారారు. 

ఇద్దరి గొప్ప స్నేహితుల మధ్య ఉండే స్నేహం, మానసిక సంఘర్షణ.. పొలిటికల్ జర్నీలో వారు ఎదుర్కొన పరిస్థితులను భావోద్వేగంగా ఆవిష్కరించిన వెబ్ సిరీస్ ‘మయసభ’. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement