Manchu Manoj : జంపలకడి జారు మిఠాయి సింగర్‌ని కలిసిన మనోజ్.. వీడియో వైరల్

జంపలకడి జారు మిఠాయా.. సోషల్ మీడియా ఫాలో అవుతున్న వారికి ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జిన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగర్ భారతమ్మ పాడిన ఈ పాట నెట్టింట ఎంతగానో వైరల్ అయ్యింది. సాధారణంగానే సినిమా పాటలకు, జానపథ పాటలకు ఎంతో తేడా ఉంటుంది. ఈ మధ్యకాంలో జానపథ పాటలకు ఆడియెన్స్‌లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది.
ఇక జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్ బాబు స్వయంగా సింగర్ భారతమ్మని పరిచయం చేయడమే కాకుండా స్టేజి మీదకి పిలిచి ఆవిడ మా ఊరి నుంచి వచ్చారు పాట పాడతారు అంటూ ఎంకరేజ్ చేశారు. ఇక జంపలకడి జారు మిఠాయి.. అంటూ భారతమ్మ పాడిన ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మరోవైపు ట్రోల్స్ కూడా అదే రేంజ్‌లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
రీసెంట్‌గా ఈ సాంగ్‌కు రీమిక్స్ యాడ్ చేసి ఇన్‌స్టాలో రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ తాజాగా సింగర్ భారతమ్మను కలిశారు. ఆమెతో జంపలకడి జారు మిఠాయి పాట పాడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Happy Birthday @iVishnuManchu anna :) Be positive and stay healthy always 🙌🏽❤️ #HBDVishnuManchu #JambaLakadiJaaruMittaya pic.twitter.com/elhBkboqHE
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 23, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు