
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ కారు కొనుగోలు చేసింది. అయితే, రీసెంట్‌గా ముంబైలోని తన ఫ్లాట్ అమ్మేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కారు కొనడంతో వార్తలో నిలిచింది. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ను గత నెలలోనే ఆమె విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్‌ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్‌ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది. ఇప్పుడు అలా వచ్చిన లాభంతో ఒక లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేశారని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మలైకా అరోరా తాజాగా రేంజ్ రోవర్ SUV సెగ్మెంట్‌లో ఐకానిక్ మోడల్‌తో ఉన్న కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అత్యుత్తమ కార్లలో ఒకటిగా సెలబ్రిటీలు ఈ మోడల్‌ను చూస్తారు. ఈ కారును సెలబ్రిటీలలో విపరీతంగా ఇష్టపడటానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన ఫీచర్లతో కూడిన క్యాబిన్‌తో పాటు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరింత లగ్జరీని తీసుకురావడమేనని చెబుతారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ కారు పనిచేస్తుంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ/గం వరకు పరుగెత్తగలదు.

మలైకా కారు కొనడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది మలైకా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే, మరికొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువ మంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. వారు తరుచుగా ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేయడం సరైన రేటు వచ్చాక తిరిగి అమ్మేయడం చేస్తుంటారు. ఈ రకంగా వారు అదనపు లాభాలను పొందుతుంటారు. అలా తను అమ్మేసిన ఇంటి మీది వచ్చిన లాభంతోనే మలైకా కొత్త కారు కొనుగోలు చేసిందని ఆమె అభిమానులు చెబుతున్నారు.
మలైకా అరోరా చయ్య చయ్య (Dil Se)పాటతో బాలీవుడ్‌లో మొదట సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్‌లో తళుక్కుమన్న ఈ బ్యూటీ తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్‌తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్‌లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.