మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు: పరారీలో హీరో నవదీప్‌.. అరెస్ట్‌ కోసం గాలింపులు! | Madhapur Drugs Case: Hyderabad CP CV Anand Says Tollywood Hero Navdeep Escaped - Sakshi
Sakshi News home page

Madhapur Drug Case: టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం.. పరారీలో హీరో నవదీప్‌!

Published Thu, Sep 14 2023 6:50 PM

Madhapur Drug Case: Tollywood Hero Navdeep Escaped, CP CV Anand Says - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . ఈ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్‌ తీసుకున్నవారిలో హీరో నవదీప్‌ కూడా ఉన్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాడు.

(చదవండి: అలాంటి సీన్లు ఉన్నాయ్‌.. బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్‌ సీరియస్‌)

నవదీప్‌ స్నేహితుడు రాంచందర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చి చెప్పారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. 

నేను ఎక్కడికి పారిపోలేదు: నవదీప్‌
మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసుపై నవదీప్‌ స్పందించాడు. అసలు ఆ కేసుతో తనకు సంబంధమే లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. సీపీ ఆనంద్‌ చెప్పినట్లుగా తాను పరారీలో లేనన్నాడు. హైదరాబాద్‌లోనే ఉన్నానని, పారిపోవాల్సిన అవసరం లేదన్నాడు. లవ్ మౌళి అనే తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బిజీగా ఉన్నానని ఆయన చెప్పారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement