'మ్యాడ్‌ స్క్వేర్‌' మూవీ ట్విటర్‌ రివ్యూ | Mad Square Movie Twitter Review, Social Media And Public Talk In Telugu, Check These Tweets Before Watching Film | Sakshi
Sakshi News home page

Mad Square Twitter Review: 'మ్యాడ్‌ స్క్వేర్‌' సినిమా టాక్‌ ఎలా ఉందంటే..?

Mar 28 2025 7:10 AM | Updated on Mar 28 2025 1:46 PM

Mad Square Movie Twitter Review And Social Media Talk

మ్యాడ్‌ స్క్వేర్‌తో(Mad Square) నవ్వులు పూయించేందుకు థియేటర్స్‌లోకి నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ మరోసారి ఎంట్రీ ఇచ్చేశారు. 2023లో విడుదలైన హిట్‌ సినిమా ‘మ్యాడ్‌’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు  (మార్చి 28) సినిమా విడుదలైంది. ఇప్పుటికే ఓవర్సీస్‌లో మూవీని చూసిన సినీ అభిమానులు మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా గురించి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. 

కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రానికి ప్రధాన బలం ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌ అని తెలిసిందే.

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పటికే అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో మ్యాడ్‌ సినిమా వచ్చిన పాజిటివ్ రివ్యూలే ఇప్పుడు కూడా సోషల్‌మీడియాలో  కనిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఇంటర్వెల్‌ వరకు మాత్రమే షో పూర్తి అయిందని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు అయితే బొమ్మ అదిరిపోయిందని తెలుపుతున్నారు. డీడీ, లడ్డు పాత్రలు మళ్లీ దుమ్మురేపాయని  కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ, సెకండాఫ్‌కు అంతగా రెస్పాన్స్‌ రావడం లేదని ట్వీట్లతో చెబుతున్నారు.

'మ్యాడ్ స్క్వేర్'  కథ గురించి అడగొద్దని నిర్మాత నాగవంశీ విడుదలకు ముందే చెప్పాడు. థియేటర్స్‌లో సినిమా చూసిన వారు అది నిజమే అని చెబుతున్నారు. కానీ, సినిమా ప్రారంభం నుంచే సుమారు 30 నిమిషాలకు పైగా నాన్ స్టాప్‌గా నువ్వులు తెప్పిస్తారని వారు చెప్పుకొస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి హిట్‌ రైడ్‌ చేశాడని తెలుపుతున్నారు. స్టోరీ లైన్‌ వరకు డైరెక్టర్‌ వెళ్లినా కూడా అది వర్కౌట్‌ కాలేదని చెబుతున్నారు. 'లడ్డు గాడి పెళ్లి' నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ చాలా ఎక్కువ ఫన్ అందించాయని అందరూ చెబుతున్నారు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు.

 సెకండాఫ్‌ కాస్త ఇబ్బందే
సినిమా డల్‌ అయిన ప్రతిసారి కామెడీ పంచ్‌లను ప్రేక్షకుల ముందుకు తెచ్చారట. ఫుల్‌ కామెడీగా ఉన్నప్పటికీ అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో కథ లేదంటూ కామెడీకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం బలవంతంగా కామెడీ రుద్దినట్లు అనిపిస్తుంది.  గోవా ఎపిసోడ్  బాగా ఉంటుందని అనుకుంటే అది అంతగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. లడ్డుగాడి కామెడీ బావుంది కానీ ఆశించిన మేరకు లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్టాఫ్‌లో ఉన్నంత ఎనర్జీ సెకండాఫ్‌లో కనిపించదని చెబుతున్నారు. ప్రతిదానికి కామెడీ చేయాలని చూడటం అంతగా కనెక్ట్‌ కాలేదని చెబుతున్నారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ సూపర్‌ అంటున్నారు. 

ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో మ్యూజిక్‌ కూడా లేదని చెబుతున్నారు. ఓవరాల్‌గా సినిమా యావరేజ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. యూత్‌కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని చెబుతున్నారు.  ఈ అభిప్రాయం నెటిజన్లది మాత్రమే..  పూర్తి రివ్యూ మరికొంత సమయంలో సాక్షి. కామ్‌లో మరికొంత సమయంలో వస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement