‘కలయా.. నిజమా.. గుండెలను పిండేసేలా ఉంది’

Lyricist Chandrabose Launched Kalaya Nijama Song From Vikram Movie - Sakshi

‘‘కలయా నిజమా... అనే పల్లవితో సాగే పాటలో కాసర్ల శ్యామ్‌ మంచి సాహిత్యాన్ని పొందుపరిచారు. ఈ పాట గుండెలను పిండేసేలా ఉంది. సురేష్‌ ప్రసాద్‌ సంగీతం, సత్య మాస్టర్‌ కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోశాయి’’ అని పాటల రచయిత చంద్రబోస్‌ అన్నారు. నాగవర్మ, దివ్యా సురేశ్‌ జంటగా హరిచందన్‌ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మించిన చిత్రం ‘విక్రమ్‌’. ఈ చిత్రంలోని ‘కలయా.. నిజమా’ అంటూ సాగే పాటను చంద్రబోస్‌ విడుదల చేశారు.

‘‘ప్రేమించిన అమ్మాయి కోసం ఓ సినిమా రచయిత ఏం చేశాడు? అనే ప్రేమకథకు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ జోడించి ఈ సినిమా తీశాం’’ అన్నారు హరిచందన్‌. ‘‘అక్టోబర్‌లో మంచి డేట్‌ చూసుకుని చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top