ది మమ్మీ చిత్రం గురించి పేర్కొంటూ ఇది ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నారు. ఒక జర్నలిస్ట్ కూతురి ఎడారిలో అదృశ్యం అయ్యి.. 8 ఏళ్ల తరువాత దొరుకుతుందన్నారు. అయితే ఆ తరువాత ఆ పాప శరీతంలో, ప్రవర్తనతో చాలా మార్పు కలుగుతుండటంతో ఆ కుటంబం భయభ్రాంతులకు గురౌతుందన్నారు. దానికి కారణాలు ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో చిత్రం సాగుతుందన్నారు.
ఈ చిత్రంలో మాన్‌స్టర్ రూపకల్పనను దర్శకుడు లీ క్రొనిన్ చాలా కొత్తగా మలిచారు. సాధారణ హారర్ చిత్రాల మాదిరిగా కాకుండా కొంచెం కొంచెం భయపెట్టే విధంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా మాన్‌స్టర్‌ను పగటివేళల్లో చూపుతూ కొత్త అనుభూతికి గురి చేస్తారన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది.


