ఏపీలో 'కుబేర' సినిమా టికెట్‌ ధరలు పెంపు.. | Kuberaa Movie Tickets Hike GO Issued By AP GOVT | Sakshi
Sakshi News home page

ఏపీలో 'కుబేర' సినిమా టికెట్‌ ధరలు పెంపు

Jun 19 2025 1:42 PM | Updated on Jun 19 2025 2:57 PM

Kuberaa Movie Tickets Hike GO Issued By AP GOVT

ధనుష్‌- నాగార్జున-రష్మిక  కలిసి నటించిన 'కుబేర' సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 20న విడుదల కానుంది.  అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా రూ. 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.  ఈ చిత్రంలో అక్కినేని  ఫిదా, లవ్‌స్టోరీ వంటి భారీ విజయాల తర్వాత  శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం 'కుబేర' కావడంతో అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.

ఏపీలో టికెట్‌ ధరలు ఇలా
ఏపీలోని అన్ని మల్టిప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్‌లలో టికెట్‌ ధరపై రూ. 75  పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు 10 రోజులపాటు కొనసాగించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, హయ్యర్ (1st) క్లాస్ టికెట్స్‌కు మాత్రమే ధరలు పెంచాలని సూచించింది. కుబేర టికెట్‌ ధరల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా ఆ చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సినిమా టికెట్‌ ధరలును పెంచలేదు.  పాత ధరలనే యథాతథంగా ఉంచింది. ఏపీలో కుబేర సినిమా చూడాలంటే మల్టిప్లెక్స్‌లలో అయితే రూ. 270, సింగిల్ స్క్రీన్స్‌లలో రూ. 240 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement