
ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇక సాంప్రదాయ లుక్‌తో తెలుగు ప్రేక్షకులకు తక్కువ కాలంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. దీంతో ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఓ ఫొటోషూట్‌కు ఫొజులు ఇచ్చింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రెడ్ కలర్ చూడిదార్‌లో మెరిసి పోతున్న బేబమ్మ ఫొటోలకు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. కాగా కృతి శెట్టి ఇప్పటికే ‘నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాగార్జున ‘బంగార్రాజు’లో కూడా చైతన్యకు జోడిగా అలరించబోతుంది.
