
అప్పుడప్పుడు తెలుగులో డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తుంటాయి. కాకపోతే స్టార్స్ లేకపోవడం వల్ల, మరేదైనా కారణం వల్లనో తెలియదు గానీ వాటికి పెద్దగా గుర్తింపు దక్కదు. అలాంటి ఓ మూవీనే 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రాబోతుంది?
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాలని నిర్మించిన డాక్టర్ ప్రవీణ.. దర్శకురాలిగా మారి చేసిన తొలి మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. డీసెంట్ ప్రయత్నం అనే పేరు తెచ్చుకుంది. కాకపోతే బిగ్ స్క్రీన్‌పై నిలబడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'దేవుడంటే నిజమో అబద్దమో కాదు ఒక నమ్మకం' అనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది.
(ఇదీ చదవండి: 'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ)
'కొత్తపల్లిలో ఒకప్పుడు' విషయానికొస్తే.. కొత్తపల్లిలో అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఉంటాడు. ఇతడి దగ్గరే రామకృష్ణ(మనోజ్ చంద్ర) సహాయకుడు. ఇదే ఊరిలో ఉండే రెడ్డి(బెనర్జీ) మనవరాలు సావిత్రిని(మౌనిక) రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించే రామకృష్ణ.. సావిత్రితో పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలని అనుకుంటాడు.
నేరుగా ఆమెతో మాట్లాడే ధైర్యం లేక సావిత్రి ఇంట్లో పనిచేసే అందం(ఉషా) సాయం తీసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనల కారణంగా అందంని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అప్పన్న చనిపోతాడు. తర్వాత ఊరిలో జరిగిన పరిణామాలేంటి? చివరకు రామకృష్ణ సావిత్రి ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)
