సీఎం విజయ్‌కు స్టార్ హీరో విజ్ఞప్తి.. అదేంటంటే? | kollywood hero Vijay Sethupathi Request to CM Vijay | Sakshi
Sakshi News home page

Vijay: సీఎం విజయ్‌కు స్టార్ హీరో విజ్ఞప్తి.. అదేంటంటే?

May 25 2026 2:31 PM | Updated on May 25 2026 2:54 PM

kollywood hero Vijay Sethupathi Request to CM Vijay

కోలీవుడ్ హీరో విజయ్ సీఎం అయ్యాక సినీ పరిశ్రమ ఆయనపై గంపెడాశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి సీఎంకు విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించాలని విజయ్‌ను కోరారు. ఓటీటీ ప్లాట్‌ఫారాన్ని ప్రారంభిస్తే అది తమకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

విజయ్ సీఎం అయ్యాక విశాల్ సైతం ఇండస్ట్రీ ఇబ్బందులను వివరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని నియమించడాన్ని తప్పుబట్టారు. సినిమా శాఖను సీఎం వద్దే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితేనే న్యాయం చేయగలడని అన్నారు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అ‍య్యాక కోలీవుడ్ సినీతారలు సంబురాలు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement