కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన మార్క్ ట్రైలర్ వచ్చేసింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా మార్క్ సినిమా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ సుదీప్‌కి 47వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ్లో విడుదల కానుంది.


